31, మే 2021, సోమవారం

హోప్

 

ఒకవైపు ఊపిరందని
కేసుల గిలగిలలు
ఒకవైపు హోప్ తగ్గని
కాసుల గలగలలు.

-

28, మే 2021, శుక్రవారం

"పైసా" చికానందం

 

హింసకు పాల్పడడంలో
కొందరిది పైశాచికానందం
కొందరిది "పైసా" చిక్కానందం.

" గీ...తాలు"

 

తెలుగుదనం తొణికిసలాడేవి
వినసొంపు గీతాలు
ఇంగ్లీషుదనం వణికిసలాడేవి
విన"వంపు" గీ...తాలు.


25, మే 2021, మంగళవారం

20, మే 2021, గురువారం

"దూరు" ఆలోచన

 "దూరాలోచన" ఉన్నవారు

పాటించేది "భౌతిక దూరం"

"దూరు" ఆలోచన ఉన్నవారు

పాటించేది "భౌ" తిక్క దూరం. 
16, మే 2021, ఆదివారం

"బ్లాక్ ఫంగస్"

 

కొండనాలుక్కి మందేస్తే

ఉన్న నాలుక ఊడటం
అంటే..."కరోనా"కు మందిస్తే
"బ్లాక్ ఫంగస్" రావటం.

14, మే 2021, శుక్రవారం

"టీ " కా

 

టీకా దొరక్క
ఒకడేడుస్తుంటే
టీ కావాలని
అడిగాట్ట ఒకడు.


13, మే 2021, గురువారం

WAY లట

 


వచ్చేది మూడో వేవట
అందరికీ మూడే వేవట
రక్షణకు మూడే WAY లట
పాటిస్తే అదే పదివేలట.


12, మే 2021, బుధవారం

a love కేకా

 

కొందరు
అలౌకికానంద స్వాములు
కొందరు
a love కేకానంద స్వాములు.


11, మే 2021, మంగళవారం

చేతులారంగ


చేతులారంగ "హ్యాండ్వాషు" చేయడేని
మూతి ముక్కుల "మాస్కు"తో మూయడేని
తగిన "డిస్టెన్సు" యుండగా దలపడేని
కలుగు వాడికి "కోవిడు" కలుగు చేటు.


9, మే 2021, ఆదివారం

అంఆ

 అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.


అం...అంటే గాలి నింపటం
ఆ...అంటే గాలి వదలటం
వెరసి ...ఉచ్ఛ్వాస, నిశ్వాస
అదే "అంఆ"...అంటే "అమ్మ".పూసుకున్నంత

 

పూసుకున్నవాడికి

పూసుకున్నంత
మూసుకున్నవాడికి
మూసుకున్నంత
కరోనా.....


8, మే 2021, శనివారం

గరళ కంఠులు

 

అందరిలోనూ
చూడమన్నారు ఈశ్వరుణ్ణి
ఇప్పుడు ప్రతి మనిషిలో
చూస్తున్నారు
"కరోనా గరళ" కంఠుణ్ణి.6, మే 2021, గురువారం

రిలాక్సేషన్

 

అందించండి అందరికీ వేక్సినేషన్

అందుతుంది మనసులకు రిలాక్సేషన్
ఆగిపోతుంది వైరస్ ల మ్యుటేషన్
అవుతుంది కోవిడ్ లెస్ నేషన్.


5, మే 2021, బుధవారం

"గస"

 


"కరోనా" ఎండనబడి

"గస" బెట్టే బాటసారులు

"ప్రాణవాయువు" పంచే

"చలివేంద్రం" కోసం ఎదురుచూపులు.


4, మే 2021, మంగళవారం

"ఓ" 2

 మనిషి ప్రాణం నిలవాలంటే

సక్రమంగా అందాలి "O"2
ప్రజాస్వామ్యం నిలవాలంటే
సక్రమంగా వేయాలి "ఓటు"


ఫలితం సున్నా

 

"మాస్కు" సరిగా
ధరించకపోయినా
"మంత్రం" సరిగా
పఠించకపోయినా
ఫలితం సున్నా నాయనా.


2, మే 2021, ఆదివారం

ఏ"వేవో"

 

సెకండ్ వేవో, థర్డ్ వేవో
అంటూంటారు ఏవేవో
జాగ్రత్తగా ఉండటమేలే
భయపడక ఉండుట మేలే