29, సెప్టెంబర్ 2018, శనివారం

వా యింపు.


Image result for music listening















పాట వెనుక ఏమిటి 
ఆ వాయిద్యాల వాయింపు
చక్కని బాణీతో 
చెవులకు అందించవా యింపు. 

26, సెప్టెంబర్ 2018, బుధవారం

వృధాశ్రమ




Image result for baby care and old age home





"కేర్ కేర్" మంటూ శిశువులు 
బేబీ కేర్ సెంటర్ లో 
"వృధాశ్రమ" పడ్డామనుకుంటూ 
వృద్ధులు వృద్ధాశ్రమంలో.

25, సెప్టెంబర్ 2018, మంగళవారం

"బ్లాక్ డే" రా.


Image result for fake baba images









కొందరు బాబాలమంటూ వేస్తారు "డేరా" 
ప్రవచనం(?)తో భక్తులను బాదుడేరా 
ఆపై కడతారు మేడపై మేడేరా
అక్కడకు వెళ్ళినవారికి అది "బ్లాక్ డే" రా.

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

నవ్వులపాలే.


Image result for drinking milk













నీవు తాగేది నిజంగా పాలే 
అయినా చూసుకో తాటిచెట్టు
నీప్రక్కన లేకుండేట్టు 
లేదంటే ఔతావు నవ్వులపాలే. 

20, సెప్టెంబర్ 2018, గురువారం

తలప 'కహాని'.


Image result for helping hands















జీవించాలి మనం 
పరులకు మనసున తలపక 'హాని' 
అప్పుడు అవుతుంది
నలుగురికీ మన జీవితం తలప 'కహాని'.

19, సెప్టెంబర్ 2018, బుధవారం

మనసు కనిపించాలి.


Image result for pure love images















ప్రేమించాలనేవారి మది స్వచ్ఛమని  
మన మనసుకనిపించాలి
వారికికూడా నిర్మలంగా 
మన మనసు కనిపించాలి.

17, సెప్టెంబర్ 2018, సోమవారం

ఇదేం పోయేకాలం


Image result for summer sun light










ఎండాకాలానికి ఇదేం పోయేకాలం
పై "రవి" తో పైరవి జరుపుతూ 
కుర్చీ వదలనంటుంది
వచ్చినా బదిలీపై వెళ్ళిపోయేకాలం.

15, సెప్టెంబర్ 2018, శనివారం

"ఘాటు" రోడ్డు


Image result for mirchi yard guntur










కొండమీదగాక గుంటలో ఉన్నా 
మా ఊరికున్నది "ఘాటు" రోడ్డు
మరి ప్రక్కనే ఉందిగా 
గుంటూరు "మిర్చి" యార్డు!

దాగుడుమూతలు


Image result for cloudy sky background









వాన చినుకులకు వయసొచ్చినా 
ఇంకా పిల్లచేష్టలు పొలేదు
బయటకు రాకుండా ఎప్పుడూ 
మేఘం ఇంట్లోనే "దాగుడుమూతలు."

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

లాగిన్లతో లాగేస్తూ


Image result for cell chating



నీగుప్పిట లాగిన్లతో 
ప్రపంచాన్ని చూపే సెల్లు 
నీగుట్టును లాగేస్తూ 
అందులో ప్రపంచం కళ్ళు.

8, సెప్టెంబర్ 2018, శనివారం

ప్రతి ఘటన

Image result for god images



తెల్లారేసరికి 
ఏబ్రతుకు తెల్లారుతుందో!
చీకటిబడేసరికి ఎవరి జీవితం 
చీకట్లోకలుస్తుందో! 
పైవాడి చేతలే ప్రతి ఘటన 
మన చేతనౌతుందా ప్రతిఘటన?

7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

ఇంద్రజాలం


Image result for farmer tears











ఇంద్రుడు పంపిన మేఘం 
చేస్తోంది ఇంద్రజాలం
పంపిస్తోంది నీటిని తనఒంటినుంచి
కాకుండా రైతు కంటినుంచి.

2, సెప్టెంబర్ 2018, ఆదివారం

వెన్నంటి నాకేసి




శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.


Image result for child shree krishna







అల్లరి కృష్ణుడా! కుండలో వెన్నంటి 
పిల్లిలా వెళ్తావు వేలితో నాకేసి
నల్లనయ్యా! ఉండవా నావెన్నంటి

చల్లని దృష్టితో చూడు ఎప్పుడూ నాకేసి
.

1, సెప్టెంబర్ 2018, శనివారం

ఎలా"గోల”


Image result for music notes










సంగీతం శ్రావ్యంగా తోచాలి 
విన్నమనసు ను దోచాలి
ఎలా"గోల” బాదేస్తే ఎలా!
విన్నాక బాధేస్తే ఎలా?