28, డిసెంబర్ 2019, శనివారం

ఇంగిలీషు "షుగరు".

చేత వెన్నముద్ద లేని
జానిజాని షుగరు
తెలుగుతీపి ముట్టలేని
ఇంగిలీషు "షుగరు".

25, డిసెంబర్ 2019, బుధవారం

రాత - గీత

గుడిలో నల్లనయ్య
గీతతో రాతలు
బడిలో నల్లబల్ల
రాతతో గీతలు
నరులకు మారుస్తూ.


16, డిసెంబర్ 2019, సోమవారం

అగ్నిపరీక్ష

"అగ్నిపరీక్షకు" నిలచి నీరు
ఆవిరై ఆకాశయానం చేస్తోంది
"గాలితిరుగుళ్ళతో" ఆవిరి
నీరై భూమిపై పతనమౌతోంది.


15, డిసెంబర్ 2019, ఆదివారం

ఇంట "రెస్టు"

కొందరికి ఎప్పుడూ
ఇంట "రెస్టు"
తీసుకోవడమంటే
"ఇంటరెస్టు".


9, డిసెంబర్ 2019, సోమవారం

"రేపురుషులు"

"రేపురుషుల"
అతి "కామాలు"
అతివల ప్రాణాలకు
"ఫుల్ స్టాప్" లు.


2, డిసెంబర్ 2019, సోమవారం

"ప్రత్యక్ష ప్రసారం"

జరిగితే ఘోరం
చెప్పే విషయం
తలపిస్తోంది "ప్రత్యక్ష ప్రసారం"
ఉందా అంత అవసరం.


1, డిసెంబర్ 2019, ఆదివారం

"విష్" సంస్కృతి

మృగాళ్ళ "విష్" సంస్కృతి
చెందుతోంది అభ్యున్నతి
'యూస్ అండ్ త్రో' నుండి
'యూస్ అండ్ ఫైర్' దాకా.

కు...సంస్కారం

సమాజానికి ప్రమాదం
పిల్లల కుసంస్కారం
చదువుతో నేర్పాలి
పిల్లలకు సంస్కారం.

24, నవంబర్ 2019, ఆదివారం

తెలుగు 'వాడ' కూడదు.

తెలుగు వాడకూడదని కొందరు
తెలుగువాడ! కూడదని కొందరు
నిర్ణయమేదైనా వికసించాలి
తెలుగు 'వాడ' కూడదు.


22, నవంబర్ 2019, శుక్రవారం

సెల్ "ఫీలు"

"సెల్ఫీలు" 
ఎన్నైనా తీసుకో
ఇదే చివరిదౌతుందని 
సెల్ "ఫీలు" 
అవకుండా చూసుకో  

16, నవంబర్ 2019, శనివారం

చెయ్ స్వారి

మనసు గుఱ్ఱం
బుద్ధి కళ్ళెం
సరిగా చెయ్ స్వారి
లేకుంటే పడతావ్ జారి.

9, నవంబర్ 2019, శనివారం

పలుకు "బడులు"

ఇక "నో" ట
తెలుగు పలుకు "బడులు"
తిరుగునా "నోట"
తెలుగు "పలుకుబడులు".

8, నవంబర్ 2019, శుక్రవారం

"మోర్" ఎత్తుకు

"మోర" ఎత్తుకుని
"మోర్" ఎత్తుకు వస్తోంది ఆంగ్లము
"సేవ" చేసేవారికై
"సేవ్" చేసేవారికై చూస్తోంది ఆంధ్రము.

5, నవంబర్ 2019, మంగళవారం

"ఛీ"త్రీకరణ

దయలేని "వెట్" చాకిరీ 
"ఛీ"త్రీకరణల తో
ఎన్ని స్మార్ట్ ఫోన్ లు 
కుమిలి పోతున్నాయో!
29, అక్టోబర్ 2019, మంగళవారం

'వన్ డే' పదార్థాలు.

ఎగబడి తినకు
బయట 'వండే' పదార్థాలు
నిలవున్నవి కాకుండా
ఇంటతిను 'వన్ డే' పదార్థాలు.
25, అక్టోబర్ 2019, శుక్రవారం

ధర

ధరపై పంటవేసి
రైతు చూపు ఆకాశంలోకి
పంట ధర భూమిలోకి
రైతు ఆకాశంలోకి.


22, అక్టోబర్ 2019, మంగళవారం

బారులు

బారులు దీరి మందులకోసం 
ఆస్పత్రి వద్ద రోగులు
బారుల వద్ద 'మందుల' కోసం
ఆతృతతో భావి రోగులు.


19, అక్టోబర్ 2019, శనివారం

"హోపిక"

జీవన పోరాటానికి 
పెంచుకోవాలి ఓపిక 
గెలిచి తీరుతామని
ఉంచుకోవాలి "హోపిక". 


14, అక్టోబర్ 2019, సోమవారం

నాగరికం.

చిరుగుల  దుస్తులు 
కట్టుకొని ఉంటే 
పేదరికం
కొని కట్టుకుంటే 
నాగరికం.


.


4, అక్టోబర్ 2019, శుక్రవారం

"SAVE" ఇస్తాయి.

దైవాన్ని, ఔషధాన్ని
నమ్మకంతో "సేవిస్తే"
తగిన విధంగా నీకు
తప్పక "SAVE" ఇస్తాయి.

3, అక్టోబర్ 2019, గురువారం

అమృతాంజనం

వినబడే పాటలు
రెండు రకాలు
అమృతం పోసేవి
అమృతాంజనం పూసేవి.

1, అక్టోబర్ 2019, మంగళవారం

'ఫోటో' కి దండ

'సెల్ఫీ' ఫోటో  తీసుకో
నీ 'ఫోటో' కి దండ 
పడకుండా  చూసుకో. 30, సెప్టెంబర్ 2019, సోమవారం

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

'ఇల్ ఆల్ '

ఇంటికి వెలుగే
ఇల్లాలంట
లేకుంటే "వెల్"గా
'ఇల్ ఆల్' ఇంట.

25, సెప్టెంబర్ 2019, బుధవారం

"కేలు" చెంత.

స్వధర్మ నిర్వహణలో 
నరునకేల చింత 
వెన్నంటి ఉంటుంది
నారాయణుని "కేలు" చెంత. 


19, సెప్టెంబర్ 2019, గురువారం

ఉప్పొంగుతాయి

నాజూకు నగరాలు 
తళుకులకు మురిసి మనసులు 
వానలకు మురికి కాలువలు  
ఉప్పొంగుతాయి.


16, సెప్టెంబర్ 2019, సోమవారం

వీడియో "గం".

బాగుంది వీడి యోగం   
అంటలేదు ఆ రోగం
జబ్బులాటిది వీడియోగేం  
వదలదది వీడియో "గం". 

14, సెప్టెంబర్ 2019, శనివారం

బేతాళుడి ప్రశ్న

అక్కడి బేతాళుడి "ప్రశ్నకు"
"సమాధానం" చెప్పలేక మౌనమా
మాతల వేయి వక్కలౌతున్నది
"విక్రం!" సమాధానం చెప్పు.

10, సెప్టెంబర్ 2019, మంగళవారం

"విక్రం" మాట్లాడాలి


"మూను" మామ ముద్దుతో  
ఆనందంలో మునిగిపోయావా?
"విక్రం!" తేరుకొని మాట్లాడు 
భరత భూమి"తల్లి"డిల్లుతోంది. 

4, సెప్టెంబర్ 2019, బుధవారం

2, సెప్టెంబర్ 2019, సోమవారం

మన "వి" నాయకులకు.

ఊరూరా గరికను భక్తితో 
సమర్పిద్దాం మన వినాయకులకు 
ఔరౌరా! గడ్డిని తినొద్దని 
చేద్దాం మనవి నాయకులకు. 

1, సెప్టెంబర్ 2019, ఆదివారం

"సొల్లా"ర్ ఎనర్జీ.

లోకాన్ని చుట్టివచ్చే
పు"కారు"కు
ఇంధనం
"సొల్లా"ర్ ఎనర్జీ.


31, ఆగస్టు 2019, శనివారం

29, ఆగస్టు 2019, గురువారం

అడ్డుకట్ట

"పవర్" కావాలంటే 
అవసరమైన మేరకు
అడ్డుకట్టవుండాలి 
నోటికి,నీటికి.  

26, ఆగస్టు 2019, సోమవారం

అది కారం.

అవసరమైన వరకే
ఉపయోగించమంట
పులుముకుంటే మంట
అధికారం - అది కారం.

ఉండి పోరు

కార్యసాధకులు సమస్యలొస్తే
నిరాశతో ఉండిపోరు
లక్ష్యం చేరేదాకా చేస్తారు
ఎదురుగా ఉండి పోరు 

(ఏ )దోచెయ్యాలని

అనుకోకు నలుగురినీ
పుట్టినందుకే దోచెయ్యాలని
అనుకోవాలి నలుగురికీ
పుట్టినందు కేదోచెయ్యాలని.
21, ఆగస్టు 2019, బుధవారం

ర 'హాస్యాలు'

ఋషులు కథలలో దాచారు
ఖగోళ రహస్యాలు
అర్థం కానివారికి
కనబడేది హాస్యాలు.


19, ఆగస్టు 2019, సోమవారం

వరదా! వరదా!

ఇక్కడ పోతుంటే మునిగి 
ఎవరది? దేవుణ్ణి 
తెలుగులో ప్రార్థించేది 
వరదా! వరదా! అని?

తెలుగు వాడనీ!

విదేశంలో పుట్టినా 
మీ వాడిని తెలుగు వాడనీ!
ఎలుగెత్తి చాటాలిరా 
మా వాడు 'తెలుగువాడనీ'.

16, ఆగస్టు 2019, శుక్రవారం

చదువులమ్మ పూనటం

పాఠశాలల్లో తగ్గాలి
చదువు 'లమ్మబూనటం' 
విద్యార్థులకు పెరగాలి
'చదువులమ్మ' పూనటం.

నారి,చిన్నారి

అత్యాచారి ఔతున్నాడు హత్యాచారి
వాడికెవరైతేనేం నారి,చిన్నారి
'శిక్షఉరి' అన్నా మారటం లేదుమరి
ఎవరి జాగ్రత్త వారిదే ప్రతిసారి.


12, ఆగస్టు 2019, సోమవారం

రో 'గం జాయి'

జాగ్రత్త ....వాడు 
వాడుతాడురో 'గంజాయి'
అంటిస్తాడు
అంటు  రోగం.... 'జాయి '

9, ఆగస్టు 2019, శుక్రవారం

చల్లని "వారు".

కొందరు కలిసుంటారు
పైకి 'చల్లనివారు '
జరుగుతూ ఉంటుది
మధ్య చల్లని "వారు". 
...

కా 'వరము'.

తగ్గించుకోకుంటే
కండకావరము
దేవుడేయిచ్చినా
నిలుస్తుందా వరము.


7, ఆగస్టు 2019, బుధవారం

3, ఆగస్టు 2019, శనివారం

వీడి "యోగా"

అనుసరించండి
వీడి "యోగా"
అందిస్తున్నాడుగా
"వీడియోగా".


1, ఆగస్టు 2019, గురువారం

"సే" వ్వా!

సమాజ సేవ 
సాహిత్య సేవ 
చేస్తున్నవారికి
"సే" వ్వా!

30, జులై 2019, మంగళవారం

29, జులై 2019, సోమవారం

'చెయ్యి'స్తాడు.

నటన సూత్ర ధారి
నటన అందరి చేత చేయిస్తాడు
మంచి "యాక్షన్" కి చేయిస్తాడు
"ఓవర్ యాక్షన్" కి 'చెయ్యి'స్తాడు.

28, జులై 2019, ఆదివారం

వత్తిడి

జ్యోతిని వెలిగించు
తైలముతో వత్తిడి
దేవుని ధ్యానించు 
తొలగించుకో ఒత్తిడి.

25, జులై 2019, గురువారం

24, జులై 2019, బుధవారం

'లాజిక్కు'లు

కోరితే దేవుని కోర్కెలు 
తీస్తాడు 'లాజిక్కు'లు
కోరక వేడితే రావు 
అంతలా చిక్కులు.

19, జులై 2019, శుక్రవారం

కావుకావుమని.

కనీసం ఎంగిలిచేత్తో తోలావా కాకిని
అరుస్తుంటే కావుకావుమని
లేకుంటే ఉంటుందా నీకు భగవంతుని
అడిగే అర్హత కావుకావుమని.

18, జులై 2019, గురువారం

"టిక్" టాక్

అనాలోచిత "టిక్ టాక్" 
మృత్యువు నీకు పెట్టే "టిక్" 
ఆపై  నీ గురించే "టాక్".  

16, జులై 2019, మంగళవారం

"కేర్" ఇంతలు

వినబడాలంటే
పిల్లల కేరింతలు
కావాలి వారికి
పెద్దల "కేర్" ఇంతలు.


9, జులై 2019, మంగళవారం

రా 'బడిని.'

చదువులమ్మ దయతో
పెట్టాడురా బడిని
చదువులమ్మకంబెట్టి
పెంచాడు రాబడిని.


8, జులై 2019, సోమవారం

ఈ "టెలుగా"

ఆ "టెల్గు" వారు
మాట్లాడేది ఈ "టెలుగా"
"తెలుగు"వారికి ఆమాటలు
తగులుతున్నాయి "ఈటెలుగా".


7, జులై 2019, ఆదివారం

కందిన ముఖంతో

కమలాలను చూడాలని
వెలిగిపోతూ రావడం
కలువలు పట్టించుకోలేదని
కందిన ముఖంతో వెళ్ళడం.


3, జులై 2019, బుధవారం

'ఫిల్లర్ విత్ ఫిల్టర్'.

మబ్బు 'వాటర్ ట్యాంకర్'
గాలి 'నడిపే డ్రయివర్'
సముద్రం 'రిజర్వాయర్'
సూర్యుడు 'ఫిల్లర్ విత్ ఫిల్టర్'.

2, జులై 2019, మంగళవారం

మబ్బు "తెర "

ఇటు సిగ్గు 'మొగ్గ 'లతో తామర
అటు ఉషోదయ 'కాంతి'తో సూర్యుడు
నడుమ 'వధూవరు'ల మధ్య
ప్రకృతి పట్టిన "తెర "లా మబ్బు.