20, ఫిబ్రవరి 2012, సోమవారం

నా 'శం' కరుడు

వాక్కులు తానే పుట్టించినా 
మౌన వ్యాఖ్యతోనే 
ఎన్నింటినో  తెలిపే  
వాడు  నా  శంకరుడు 

చిక్కులు ఎన్ని చుట్టు ముట్టినా 
మౌనంగా ధ్యానిస్తే 
అన్నింటిని దులిపే 
భవ నాశం  కరుడు. 

2 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

అందుకే భోళా శంకరుడయ్యాడేమో!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

రసజ్ఞ గారూ! శంకరానుగ్రహ ప్రాప్తి రస్తు. ధన్యవాదములు.