10, ఏప్రిల్ 2012, మంగళవారం

అమ్మా'యెందుకని'

అమ్మలూ...
కడుపునున్న గ్రుడ్డుపై 
మీకు దయలేదా? 
ఆడ శిశువును 
పుట్టకముందే 
పుట్టి ముంచుతున్నారు
అబ్బాయి చాలు 
అమ్మాయెందుకని


అమ్మలూ...
కడుపున  నున్న నీవైనా 
అమ్మను అడగలేవా?
నీవు కూడా ఆడదానివే కదా
నీ తల్లి నిన్ను కన్నది కదా  
నామీద కక్ష 
అమ్మా!  యెందుకని.

4 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

అమ్మకెంత దయ ఉన్నా
..... ఆమె మాట విలువ సున్నా
అమ్మాయే వద్దని తీర్మానం
..... చెమ్మగిలే కనుల మౌనం
అమ్మ కూడా అమ్మాయిగానే
..... అవతరించిందని మరువగానే
అమ్మదనానికి అజ్ఞానపు శాపం
..... అతగాడిదే యీ అసలు సిసలు పాపం.

అజ్ఞాత చెప్పారు...

chaala bagundi gssastry

రసజ్ఞ చెప్పారు...

మన్నించాలి!మీ రెండో వాక్యముతో నేను ఏకీభవించలేను! ఏ తల్లికీ తన బిడ్డని చంపుకోవాలని ఉండదు ఆడైనా, మగైనా! కనుక ఇటువంటి పాపాలలో తల్లి బాధ్యురాలు కాదు అని నా అభిప్రాయం.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

రసజ్ఞ గారూ! ధన్యవాదములు.ఇది కొందరు అమ్మల గురించే....కన్న బిడ్డలను కని పారేస్తున్న,గొంతు పిసికి పారెస్తున్న యెన్నో సంఘటనలు వింటున్నాం..కంటున్నాం...కాదంటారా!