బెట్టింగు బెట్టింగు బెట్టింగు
పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు గుర్రాల రేసుల్లో బెట్టింగు పేకాట జూదాలా బెట్టింగు క్రిక్కెట్టు ఆటల్లో బెట్టింగు ఎన్నికల ఫలితాలా బెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు జూదాలు బాగా ఆశబెట్టింగు చేతులేమొ నీకు దురద పెట్టింగు ఉంటుంది ఆవల వల సెట్టింగు గెలుపుండదు అంత సున్న చుట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు వేశావా దానితో సిట్టింగు ఆశతో కాశావా బెట్టింగు ఉన్నసొమ్మంతా ఊడగొట్టింగు ఆస్తులన్నంటినీ కుదువా బెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు పందేలు చేస్తాయా కూడు బెట్టింగు కుదిరెందెవరికి గెలిచి కూడ బెట్టింగు ఆడితె నీ భవిత పాడుబెట్టింగు కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు కట్టిపెట్టాలి చెడ్డదారిపట్టింగు చెడుస్నేహాలకు ఇవ్వరా కట్టింగు చేయాలి తెలివి పదునుబెట్టింగు మంచి త్రోవపైనా దృష్టిబెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు ఆపరా బెట్టింగులకు పరుగు బెట్టింగు చేయరా సిట్టింగులను పడుకొబెట్టింగు నేర్వరా చెడు తలపులకు పొగబెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలని ఫిట్టింగు ఆపరా బెట్టింగులకు పరుగు బెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి