"ఇది" అని చెప్పలేక
ఇదైపోయే ఇదిలో
"ఇది"ని వాడితే
ఎంత ఇదిగా ఉంటుందో!
అందుకే "ఇది" అంటే
నాకు ఎంతో ఇది.
"ఇది" అని చెప్పలేక
ఇదైపోయే ఇదిలో
"ఇది"ని వాడితే
ఎంత ఇదిగా ఉంటుందో!
అందుకే "ఇది" అంటే
నాకు ఎంతో ఇది.
కలిసొచ్చే
రోజులే కాదు
నీ జీవితంలోకిప్రతి జీవి పుట్టుకా
మనటానికే
ఎప్పుడొకప్పుడు
పుటుక్కుమనటానికే
పాట వ్రాస్తే
"ఇదీ" మా రాత
అని చెప్పుకునేట్లుండాలి
వినే వారు
ఇది మా "రాత"
అని నొచ్చుకునేట్లు కాదు.
వాక్కులు "మితి"మీరితే
అవాకులూ చవాకులూ
ఇంకా మీరితే
"హవ్వా"క్కులు, "ఛ" వాక్కులు
"యాక్"కులు
కొందరు
బట్టలు కట్టుకుంటారు
మరికొందరు
"కట్" కుంటారు.
చక్కనమ్మ
చిక్కినా అందమే