28, మే 2025, బుధవారం

ఆ"నందమూరు"

 గతములో ఒక పోటీకి  వ్రాసి ప్రశంసలు పొందినది. 

"నందమూరి" జయంతి సందర్భంగా


శీర్షిక: ఆ"నందమూరు"    

 

ఆంధ్ర దేశంలో అది ఒక ఊరు "నిమ్మకూరు"    

అక్కడ నందమూరి వంశంలో పుట్టాడొక వెలుగు "స్టారు"      

"తారక రామారావు" పెద్దలు పెట్టిన పేరు 

"పేరు" తెచ్చుకున్నాక అయ్యాడతడు "ఎన్ టి యారు"   


కష్ట జీవిగా ఎదిగి "బీఏ" పట్టా సాధించారు    

ఆపైన చేసిన ఉద్యోగం తనకిమడని "సబ్ రిజిస్ట్రారు"   

అది నచ్చక  నటుడవాలని మద్రాసు దారి పట్టారు 

మొదట "మనదేశం" చిత్రంలో మంచి నటన చూపారు    


శివుడూ, రాముడూ, కృష్ణుడూ అంటే ఆయనే గుర్తొస్తారు 

దుర్యోధన,కర్ణ, రావణ నటనకూ  పెట్టింది పేరు 

విక్రమార్క,కృష్ణ రాయ,రాజ కుమార పాత్రలలో జోరు 

పలురకాల నటనలలో ఆయనకు పోటీ ఇప్పటికీ లేరు 


నిండైన విగ్రహంతో అలా నిలుచుండే తీరు 

చిరునవ్వులు చిందిస్తూ చేయెత్తితే కలుగు హుషారు 

బ్రదర్ అంటూ పలకరిస్తే గౌరవం పొంగారు  

హావభావాలతో చేసే ఉపన్యాసాలు  వింటే మరి కదలలేరు     

  

నటసార్వభౌమునిగా "పద్మశ్రీ" పురస్కారం పొందారు  

తెలుగు ప్రజల సేవ కోసమై "తెలుగు దేశం" పార్టీ పెట్టారు 

అఖండ విజయంతో  తెలుగు వారి "ఆత్మ గౌరవం" పెంచారు 

ఆంధ్రులందరికీ "అన్న" గా అయి సుపరిపాలన అందించారు


నటునలో, రాజకీయాలలో ప్రపంచ ఖ్యాతిని పొందారు

తెలుగు జాతికంతటికీ "యుగపురుషుడు" గా మారారు

చెరిగిపోని కీర్తి తో సర్వోన్నత శిఖరం అధిరోహించారు   

ఆ "నందమూరిని" తలిస్తే చాలు మనసులో "ఆనందమూరు".





కామెంట్‌లు లేవు: