10, ఆగస్టు 2024, శనివారం

పాడు "బెట్టింగు"

 


జూదాలు బాగా ఆశబెట్టింగు
ఆవల ఎవరో “వల”బెట్టింగు
"దురాశగాళ్ళు" తలబెట్టింగు

ఆపైన కాసి "బెట్టింగు"
అప్పుజేసి డబ్బుబెట్టింగు
ఆస్తులు కుదువబెట్టింగు

ఉన్నది ఊడ్చిబెట్టింగు
గెలుపే లేకుండా ఓడబెట్టింగు
బంగరు భవితను పాడుబెట్టింగు

చేయాలి తెలివికి పదునుబెట్టింగు
బాగుపడాలనే ఆలోచనబెట్టింగు
నిజం తెలుసుకోవాలనే దృష్టిబెట్టింగు

వీడుతూ ఉండాలి అహం," బెట్టిం"గు
తదుపరి దురలవాటును పడుకోబెట్టింగు
ఆపై వదిలి పెట్టాలి పాడు "బెట్టింగు"


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

👌👌బాగుంది