అమరావతి సాహితీ మిత్రులు, లో తేది:11-01-2025 ఇచ్చిన అంశము నకు నేను వ్రాసిన గేయం.
అంశం:స్వతంత్రం
స్వతంత్రం అంటే (గేయం)
కావాలీ కావాలీ స్వతంత్రం
అందరికీ కావాలీ స్వతంత్రం
కావాలీ కావాలీ
అందరికీ కావాలీ
పరిమితిలో ఉండాలీ స్వతంత్రం
ఎపుడూ హద్దు మీరకుండాలీ స్వతంత్రం //కావాలీ//
మతం మత్తు కాదురా స్వతంత్రం
కులం గొడవ కాదురా స్వతంత్రం
మతం మత్తు కాదురా
కులం గొడవ కాదురా
హెచ్చు తగ్గు లేనిదే స్వతంత్రం
అంతా కలసి మెలసి ఉండేదే స్వతంత్రం //కావాలీ//
దోపిడీలు కాదురా స్వతంత్రం
దుర్మార్గం కాదురా స్వతంత్రం
దోపిడీలు కాదురా
దుర్మార్గం కాదురా
శాంతితోడ మెలిగేదే స్వతంత్రం
అంతా హింసలేక ఉండేదే స్వతంత్రం //కావాలీ//
బూతు మాట కాదురా స్వతంత్రం
చెంప వేటు కాదురా స్వతంత్రం
బూతు మాట కాదురా
చెంప వేటు కాదురా
సద్విమర్శ చేసేదే స్వతంత్రం
ఎంతో సహనంతో ఉండేదే స్వతంత్రం //కావాలీ//
చెడు తిరుగుడు కాదురా స్వతంత్రం
అలసత్వం కాదురా స్వతంత్రం
చెడు తిరుగుడు కాదురా
అలసత్వం కాదురా
జ్ఞానాన్నీ పొందటమే స్వతంత్రం
విజ్ఞానంతో ఎదగటమే స్వతంత్రం //కావాలీ//
విప్పుకొనుట కాదురా స్వతంత్రం
నిండు ముసుగు కాదురా స్వతంత్రం
విప్పుకొనుట కాదురా
నిండు ముసుగు కాదురా
మనిషిగా మసలుకొనుట స్వతంత్రం
మంచీ మర్యాదగ నడచుకొనుట స్వతంత్రం //కావాలీ//
అవినీతీ కాదురా స్వతంత్రం
విలాసాలు కాదురా స్వతంత్రం
అవినీతీ కాదురా
విలాసాలు కాదురా
తృప్తి తోడ జీవించుట స్వతంత్రం
మరి నలుగురికీ సాయపడుట స్వతంత్రం //కావాలీ//
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి