23, జులై 2025, బుధవారం

పాములు

 అమరావతి సాహితీ మిత్రులు

వారం వారం మినీ కవితల వేదిక 

అంశం : పాములు


ఎలుకల కన్నాలను

చీమల పుట్టలను 

కబ్జాలు చేసే పాములు

ఏం పుణ్యం చేశాయనో

కొన్ని మనుషులుగా పుడతాయి. 

-----------------------------

పామైనా 

మనిషైనా

హద్దుల్లో ఉంటే పూజ

మీరితే బడితె పూజ. 

------------------------------

ప్రతివాడూ

ఆడించాలని చూస్తాడు

నీకు విషం లేకపోయినా   

బుసలు మానకు.  


కామెంట్‌లు లేవు: