అమరావతి సాహితీ మిత్రులు
వారం వారం మినీ కవితల వేదిక
అంశం - గడియారం.
అందరూ "గడియారం"
తాను ఆడుతుందో లేదో చూస్తారు
అందరినీ తానే ఆడిస్తుందనుకోరు
------------------------------
చిన్నా, పెద్దా
శ్రమలో తేడా
ఎన్ని వ్యత్యాసాలున్నా
కలిసి "నడవటమే"
ఆల్ "టైం" సెన్స్.
-----------------------
ఏదో "తిరిగితే" సరిపోదు
"సమయ పాలన" ఉండాలి
అందరి "దృష్టి"లో పడాలి
గడియారంలా.....
-----------------------
ఏమిటో "గడియారం" బ్రతుకు
తన "మానాన"
"సక్రమంగా" పనిచేస్తున్నా తిట్లే....
అలా పరిగెడ్తావేం అంటూ కొందరు
ఎందుకంత తొందర అంటూ కొందరు
-----------------------
"గడియారం"తో మనిషికి
చెప్పలేని అనుబంధం
అది మూడు"ముళ్ళ" బంధం.
-----------------------
గుండెలో "ముళ్ళు"
"గ్రుచ్చుకొని" ఉన్నా
"కాలానికి" అనుగుణమైన
"కర్తవ్య"పాలన గడియారంది.
---------------------
గడియారం
"నియమం"
తప్పి "తిరిగితే"
"చెడి"పోయిందంటారు
నిజమే కదా?
-------------------
భూత, భవిష్యత్తుల
"గోల"లేకుండా
వర్తమానాన్ని మనకు
"ప్రెజెంట్" చేస్తుంది గడియారం.
------------------------
గడియారం ఎప్పుడూ
"వర్తమానం" లోనే ఉంటుంది
ప్రతి క్షణాని
"వర్త్" మానం చేసుకోమంటుంది.
----------------------------
పెద్దముల్లు "అడుగులను"
పట్టించుకునే వారు "ఉత్తములు"
మధ్య ముల్లు "అడుగుల వరకే"
పట్టించుకునే వారు "మధ్యములు"
చిన్న ముల్లు "అడుగులు మాత్రమే"
పట్టించుకునే వారు "అధములు"
----------------------
ముందు ఉన్నా
మూలన ఉన్నా
తన "ధర్మాన్ని" నిర్వర్తిస్తూ
అందరి "దృష్టి"నీ ఆకర్షించే
అవిశ్రాంత శ్రామికుడు గడియారం.
-----------------------
గడియారం
నడిచినంతసేపూ
నిన్నే "వాచ్" చేస్తారు
ఆగితే "తూచ్" అంటారు
----------------------
గడియారాన్ని
చూస్తే తెలిసింది
ఏదో శక్తి వెనకుండి
మనలను నడుపుతున్నదని.
-------------------
అందరి చూపులను
తన వైపుకు తిప్పుకునే
"టక్కులాడి"
"టిక్కులాడి"
గడియారం.
---------------------
మనిషి కోరికపై
వేలవేల "అవతారా"లెత్తిన
"కాల"స్వరూపుడు గడియారం.
----------------------
నరులను "మేలుకొలిపి"
"కర్తవ్యోన్ముఖులను" చేసే
"గీ" తాచార్యుడు గడియారం.
--------------------
"మోటు"కాలాన్ని
"నాటు"కాలాన్ని
"నీటు"కాలాన్ని
అన్నిటినీ ఎదురొడ్డి నిలిచి
చూపిస్తున్నది "కాలాన్ని"
--------------------------
కాలానుగుణ "మార్పులు" కద్దని
"కర్తవ్యం" వదలొద్దని
చేస్తుంది "బోధ"ని.
----------------------------
తను చూపే సమయం
కొందరికి "రస"మయం
మరికొందరికి "నీరస"మయం
"యద్భావం తద్భవతి"
-----------------------
పెద్దవాడికి పరుగెత్తటాలు
చిన్నవాడికి జరగటాలు
మధ్యవాడికి జారటాలు
ఎప్పటికీ మారని అలవాట్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి