కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
16, సెప్టెంబర్ 2016, శుక్రవారం
మనిషి..కో ..తలను.
ఆదేవుడు పుఱ్ఱెకో బుద్ధిని పెట్టి
నిలిపి ఉంచాడు
మనిషికో తలను.
ఏంచేస్తాం తప్పదు భరించాలి
కోస్తుంటారు ఒక్కొక్క
మనిషి కోతలను.
17, మే 2015, ఆదివారం
నాకమనే అంటారు
తేనెను
అరచేతిలో వేసుకుంటే
ఎవరైనా
త్వరగా
నాకమనే
అంటారు
స్వర్గానికి
మరొక పేరు చెప్పమంటే
ఎవరైనా
త్వరగా
నాకమనే అంటారు
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)