17, మే 2015, ఆదివారం

నాకమనే అంటారు


తేనెను
అరచేతిలో వేసుకుంటే

ఎవరైనా
త్వరగా నాకమనే  

అంటారు

స్వర్గానికి
మరొక పేరు చెప్పమంటే
ఎవరైనా
త్వరగా
నాకమనే అంటారు


 

9, డిసెంబర్ 2014, మంగళవారం

కళజోడు

కళ్ళజోడు
కొందరి ముఖానికి
అది కళకళ జోడు

ఎంత వెలబెట్టి కొన్నా
కొందరి ముఖానికి
అది వెలవెల జోడు.