కడలి నీరు
కండ్ల నీరు ఉప్పనే
అలజడి రేగితే
ముంచుకొచ్చేది ఉప్పెనే
కడలి నీరు
కండ్ల నీరు ఉప్పనే
అలజడి రేగితే
ముంచుకొచ్చేది ఉప్పెనే
ముఖంపై
బొట్టు "మెరవటం" కాదు
బొట్టుతో
"ముఖం" మెరవాలి.
ఎవరో కనుట
ఎటులో మనుట
ఎటకో చనుట
ఇదే జీవితమట.
అమ్మ "అరలాగు" వేస్తే
కూతురు "కుర్తా" వేస్తుందా?
అదుపు లేని నోరు
అడుసు గుంట తీరు.
"ఆలు" లేని ఇల్లు
అచ్చు లేని హల్లు.