ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
అమరావతి సాహితీ మిత్రులు
మినీ కవితల వేదిక
అంశం : కాలం
అంటీ అంటని
చిక్కీ చిక్కని పాదరసం కాలం
ఊహకు అందని
కనికట్టు చూపే ఇంద్రజాలం
సాగటమే కాని
ఆగటమంటూ లేని నిరంతర ప్రవాహం.
అనుకూలమైతే
అంతా "కూల్" మయం
లేకుంటే అన్నీ "కూలు" సమయం.