కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
13, జూన్ 2018, బుధవారం
నీరసమయము
ఈ ఉరుకుల పరుగుల జీవితం
చూస్తుంటే కలుగుతుంది
విస్మయము
సగటు మానవునికి మనసారా
స్పందించటానికి గూడా లేదు
సమయము
ప్రతివాడూ అనుకుంటాడు
తనబ్రతుకు కావాలని
రసమయము
చివరకు చూసుకుంటే ఏముంటుంది
గతమంతా చెప్పలేని
నీరసమయము
.
23, మే 2018, బుధవారం
దండగ మారి బ్రతుకు
అసూయ, ద్వేషం, అశాంతి తో
బ్రతుకకు "
దండగమారి బ్రతుకు
"
సహనం, ప్రేమ, అహింస లతో
కూడిన పూల "
దండగ మారి బ్రతుకు
."
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)