26, అక్టోబర్ 2026, సోమవారం

ఎక్స్పైరీ డేట్

 

వాడు వరుసగా

"చెత్త సినిమాలు"

ఎందుకు చూస్తున్నాడు?


వాళ్ళింట్లో

తలనొప్పి మాత్రల

"ఎక్స్పైరీ డేట్" దగ్గరపడిందట.



15, అక్టోబర్ 2026, గురువారం

పారాయణం

 వారి

"చతుర్ముఖ" పారాయణం

ప్రతిరోజూ....
అర్థరాత్రి దాకా

ఆ రోజు మాత్రం
తెల్లారేదాకా....

"శివరాత్రి" అట కదా!


14, అక్టోబర్ 2026, బుధవారం

జనులు

 "నేటి" జనులందరూ

"నెటిజనులు" ఔతున్నారు


"సిటిజను"లందరూ 

"సిటీ" జనుల్లా మారుతున్నారు.



11, అక్టోబర్ 2026, ఆదివారం

క్లోజ్ అప్

 సినిమాల్లో

"కొన్ని" సీన్లకు

ఒకప్పుడు కెమేరా "అప్"
ఇప్పుడు "క్లోజ్ అప్"



9, అక్టోబర్ 2026, శుక్రవారం

ఆవాహనం

 

మద్యం మత్తులో 

నడిపావా ఆ వాహనం!

 

అది మృత్యువు నిన్ను 

చేరుకోటానికి ఆవాహనం 

8, అక్టోబర్ 2026, గురువారం