24, జూన్ 2018, ఆదివారం

ఆ "కలికి" బలి


Image result for rape attemptఆ కలిపురుషుని మహిమ 
ఆకలి పురుషుని "ఆకలికి" 
ఆ "కలికి" బలి అవుతున్నది
ఓ కల్కీ! దిగి రావాలి.

23, జూన్ 2018, శనివారం

చె(చ)రవాణి.


Image result for cell phone
దూరంగా ఉన్నవారిని 
"దగ్గరజేస్తుంది"  
దగ్గరే ఉన్నవారిని 
"దూరంచేస్తుంది"  
చాటు 'మాటు(ట) ల ' 
మాంత్రికురాలు 
ఈ చె(చ)రవాణి.  

22, జూన్ 2018, శుక్రవారం

శవం - ఏటీయం.


కడుపులోకి ఏమీలేక చస్తే 
ప్రజల సందర్శనార్ధం   
"శీతల పేటికలో" ఉంచిన 
శవాల్లా  ఉన్నాయి
కొన్ని ఏ.టీ.యం లు. 

21, జూన్ 2018, గురువారం

"గీత" గీత


బ్రతుకు గీతను మార్చుకోమని
"గీత"నిచ్చాడు గీతాచార్యుడు
చావు గీతాన్ని చేసి 
"గీత" గీతను మార్చాడు నరుడు.

18, జూన్ 2018, సోమవారం

సినిమా...య


చిన్నతనంలో 
సినిమాను జూస్తూ  జీవితమనుకున్నా  
చిత్రం నవ్వించింది, ఏడిపించింది  

పెద్దతనంలో 
జీవితాన్ని చూస్తూ సినిమా అనుకున్నా 
చిత్రం! నవ్వులేదు, ఏడుపులేదు.   

13, జూన్ 2018, బుధవారం

నీరసమయము

ఈ ఉరుకుల పరుగుల జీవితం 
చూస్తుంటే కలుగుతుంది విస్మయము 
సగటు మానవునికి మనసారా 
స్పందించటానికి గూడా లేదు సమయము
ప్రతివాడూ అనుకుంటాడు
తనబ్రతుకు కావాలని రసమయము
చివరకు చూసుకుంటే ఏముంటుంది
గతమంతా చెప్పలేని నీరసమయము.  

23, మే 2018, బుధవారం

దండగ మారి బ్రతుకు


Image result for flowers imagesఅసూయ, ద్వేషం, అశాంతి తో  
బ్రతుకకు "దండగమారి బ్రతుకు"
సహనం, ప్రేమ, అహింస లతో  
కూడిన పూల "దండగ మారి బ్రతుకు."  

30, ఏప్రిల్ 2018, సోమవారం

చండా "MARK"లు

పరీక్షా ఫలితాలు వచ్చాయి
కొంతమంది విద్యార్థులు
సంతోషంగా ఉన్నారు
ఫరవాలేదులే అనే మాటలు వింటూ
ఆ తల్లిదండ్రుల దృష్టిలో ఈ పిల్లలు 
చదువుల "LOW" సారమెరిగిన ప్రహ్లాదులు.

పరీక్షా ఫలితాలు వచ్చాయి
ఎంతోమంది విద్యార్థులు
ఏడుస్తూ ఉన్నారు
ఇంకా చదవాల్సింది అనే మాటలు వింటూ
ఆ పిల్లల దృష్టిలో ఈ తల్లిదండ్రులు
వారి ఆనందాన్ని హరించే
చండా "MARK"లు.

27, ఏప్రిల్ 2018, శుక్రవారం

"గుప్" ఇట"గుట్టు" నెట్టులో దాచారప్పుడు 
గుట్టు "నెట్టులో" దాచారిప్పుడు 
అప్పుడు "గుప్పిట" 
ఇప్పుడు "గుప్" ఇట