19, జూన్ 2019, బుధవారం

అమ్మా! యిదా?

మురికి గుంటలో పురిటి బిడ్డ 
నీ కన్నప్రేమ అమ్మా! యిదా?
పాపం కళ్ళు మూసుకుపోయిన నీదా?
కళ్ళుకూడా తెరవని అమ్మాయిదా? 

15, జూన్ 2019, శనివారం

పెద్ద "వారు".

ప్రపంచ దేశాధినేతలు 
ఎవరికి వారే "పెద్దవారు"
సంయమనం కోల్పోతే 
జరుగుతుంది పెద్ద  "వారు". 

12, జూన్ 2019, బుధవారం

"నగ"వుండాలంటే

మనకు బంగారం కావాలి
మెడలో "నగ"వుండాలంటే
మనసు బంగారం కావాలి
ముఖంలో "నగవుం"డాలంటే.

9, జూన్ 2019, ఆదివారం

4, జూన్ 2019, మంగళవారం

"నై" పుణ్యం.

సాధించాలి నచ్చిన 
పనిలో నైపుణ్యం 
పరులను కష్టపెట్టే
పనిలో "నై" పుణ్యం. 

3, జూన్ 2019, సోమవారం

2, జూన్ 2019, ఆదివారం

31, మే 2019, శుక్రవారం

కూలి పోతుంది

పనిలేకుంటే కష్టజీవులకు
కూలి పోతుంది
ఆసరా లేకుంటే వారి బ్రతుకు
కూలిపోతుంది.

నైట్ వాచ్"మూన్".

చుక్కల పూదోటకి
రాత్రి కాపలాదారు కొలువు 
చంద్రుడికి నెలకి
ఒకరోజు మాత్రమె సెలవు.

30, మే 2019, గురువారం

"చుక్కకన్నెలు"

"చందమామ" కనబడకుంటే 
గుంపులుగా ఎదురు చూపులు 
కనబడితే మూస్తాయి సిగ్గుతో
"చుక్కకన్నెలు" తలుపులు.

29, మే 2019, బుధవారం

'మండి'పడుతున్నాడు.

ఎండాకాలం కూడా 
ఎండలెక్కువంటారేమిటి 
అని సూరీడు 
'మండి'పడుతున్నాడు.

'శంక' రా.

భక్తుల గుండెల్లో 
నిలచి ఉండే శంకరా!
భక్తి లేనివారి 
గుండెల్లో నీవొక 'శంక' రా.

22, మే 2019, బుధవారం

21, మే 2019, మంగళవారం

20, మే 2019, సోమవారం

18, మే 2019, శనివారం

కుక్కకు

మూర్ఖుడి మనసులో
హితవచనాలు కుక్కకు
ఏమిచేసినా తోక వంకర
సరియౌతుందా కుక్కకు?

16, మే 2019, గురువారం

మేఘాల గుండె పగిలి

పైనుంచి మంచు గడ్డలేమిటి? 
భూమి తాపాన్ని చూసి 
చల్లని మేఘుడి గుండె 
పగిలి ముక్కలైనట్లుంది.

15, మే 2019, బుధవారం

విండో-నెట్-మౌస్

కిటికీ, వల, ఎలుక 
భాష మాత్రమె తెలిస్తే
కిటుకీవల ఎరుక 
విజ్ఞానం సముపార్జిస్తే.

"పంట"నొక్కెయ్యాలని

కాపుగాసిన "కొమ్మా!" జాగ్రత్త
"కాపు" లేకుంటే చూసి
కాపురుషులు ఉంటారు
"పంట"నొక్కెయ్యాలని "కాపుగాసి"


13, మే 2019, సోమవారం

12, మే 2019, ఆదివారం

దూరం త్రీ ఫీటు.

ఎండాకాలం క్రమంగా 
పెరుగుతోంది హీటు 
మధ్యాహ్నం చూడగా 

కర్ఫ్యూ స్ట్రీటు 
రోజంతా 

చెమట స్నానాల హేటు
సన్నిహితుల మధ్యకూడా

 దూరం త్రీ ఫీటు.

9, మే 2019, గురువారం

భూమాత చెమట బొట్టు

భూమాత జీవుల్ని మోస్తూ 
తిరుగుతోంది సూర్యుని చుట్టూ
సప్తసముద్రాలయ్యాయనుకుంటా
చిందిన స్వేదం బొట్టూబొట్టూ.

8, మే 2019, బుధవారం

గాలి చెలి ఒడిలో

ఎండకు తిరిగి అలసినప్పుడు
చల్లని "గాలిచెలి" స్పర్శతో
సేదతీరి, మేఘుడు రాల్చిన
ఆనంద బాష్పాలు ఈ చినుకులు.

7, మే 2019, మంగళవారం

6, మే 2019, సోమవారం

5, మే 2019, ఆదివారం

రంగు "చుక్కలు".

లోకపుకప్పుకు చంద్రుడు
వెన్నెలరంగును వేస్తుంటే
ఆకాశపు నేలపై బడిన
బొట్లు ఈ "చుక్కలు".

"వాన" రమ్మని.

అల్లరి వాడిని పిలుస్తారు
"వానరమ్మని"
వాడిని ఆటలకు పిలుస్తోంది
"వాన" రమ్మని.

3, మే 2019, శుక్రవారం

ఏరు "వాక్"

'వెలుగుల' అన్నం ముద్దను
విసిరి కొట్టి, తీరిగ్గా
'మెతుకులను' ఏరు "వాక్"
చేస్తున్నాడు 'నెలబాలుడు'.

2, మే 2019, గురువారం

సూర్యహారతి

ప్రకృతి మాతకు దేవతలు ఎన్ని యుగాలనుండి పడుతున్నారో "సూర్యహారతి" ఆకాశం కప్పు, అలా నల్లబడి ఉంది.

1, మే 2019, బుధవారం

సొమ్మ "సిల్లీ"

ఎండాకాలం
ఉక్కబోస్తుందంటావెం! "సిల్లీ"
గాలికూడా
పడిపోయిందిగా, సొమ్మసిల్లి.


29, ఏప్రిల్ 2019, సోమవారం

"వేర్.... వేర్".

జగతివృక్షానికి భగవంతుడు "వేరు"
ఆ మూలము లేకుండా లేదు "వేరు"
లోకపు "కంప్యుటర్" లో నిండిన "సాఫ్ట్ వేర్"
వెతుకుతూ కొందరంటారు "వేర్ వేర్".

28, ఏప్రిల్ 2019, ఆదివారం

ఏ "దోచెయ్యాలని"

చిన్నదైనా పెద్దదైనా ఇల్లు
ఏ "దోచెయ్యాలని"చూస్తాయి కొందరి కళ్ళు
తలుపులు వేసున్నా నేడది  "కామ"న్
ఓరగా వేస్తావేం? జాగ్రత్త సా"మాన్".

26, ఏప్రిల్ 2019, శుక్రవారం

పచ్చగా నవ్వుతూ


భూదేవి ఓర్పు 
చెట్టుగా మొలిచినట్టుంది
ఎండవేడికి మాడుతున్నా 
పచ్చగా నవ్వుతూ నీడనిస్తోంది.

25, ఏప్రిల్ 2019, గురువారం

"సర్" వేలు

నొక్కి "చెప్పింది "
"ఓటర్ సర్" వేలు
"విన్" పడే దాకా అనేక "సర్వేలు "
ఏం చేస్తాం
సర్వేల "వే"లు వేలువేలు

23, ఏప్రిల్ 2019, మంగళవారం

22, ఏప్రిల్ 2019, సోమవారం

13, ఏప్రిల్ 2019, శనివారం

బాయ్ - అబ్బాయ్ .

నిన్న...అమ్మా! "బాయ్" అంటే?
"అబ్బాయ్" ... బంగారుకొండా!
నేడు...మమ్మీ! "అబ్బాయ్" అంటే?
"బాయ్"...మైబాయ్!

8, ఏప్రిల్ 2019, సోమవారం

లోక్(సభ)పాలకుడు

గుడివీధి రథంపై లోకపాలకుడు
దండం పెడుతూ చుట్టూ వేలకొలది భక్తులు
నడివీధి రథంపై దండం పెడుతూ
లోక్(సభ)పాలకుడు
చుట్టూ వేలకొలది దేవుళ్ళు.

7, ఏప్రిల్ 2019, ఆదివారం

5, ఏప్రిల్ 2019, శుక్రవారం

"అర్థం" చేసుకోకు.

ఓటు విలువ 
తెలుపుతా 
దాన్ని నమ్మి 
అర్థం చేసుకో 
దానినమ్మి 
"అర్థం" చేసుకోకు.

తెలిసి"కొంటున్నారు".

ఓటు విలువైనదన్నారు
కొందరు తెలుసుకుంటున్నారు
కొందరు తెలిసి"కొంటున్నారు".

ఓటు నీ నిధానం

ఓటు నీ నిధానం
యోగ్యుల కిచ్చుట విధానం
పాటించు నిదానం
చేయకు అపాత్ర దానం

2, ఏప్రిల్ 2019, మంగళవారం

ఎన్నిక - మన్నిక

ఏం చెప్పాలి
ఒకటారెండా ఎన్నిక
ఒకటే చెబుతా
సరిగాచెయ్ ఎన్నిక
నీ ఓటుకు ఉండాలి మన్నిక
లేకుంటే భవిషత్తు నోట మన్నిక.

31, మార్చి 2019, ఆదివారం

ఎన్నికల FUNడగ

ఎన్నికల పండుగ
వస్తోంది ఎన్నికలలో పండగ  
కొందరికి FUNDగ
మరికొందరికి FUNడగ
కొందరు గెలుపు నమ్మకంతో హాయిగా పండగ  
మరికొందరిని ఏడ్పిస్తూ అందని పండుగ   
కొందరికేమో మెడలో దండగ
ఇంకొందరికేమో అన్నీ దండగ. 

30, మార్చి 2019, శనివారం

వేసే సిరా.

చెడపాలనుకోవద్దు
వేలిపై గుర్తుగా వేసే సిరా 
చెడుపాలన కోరొద్దు
ఓటును గుట్టుగా వేసేసిరా.  

కండు"వాలు" - కండూతి.

పైన స్వచ్చమైన వలువలు
లోన కానరాని విలువలు
పైన కండు"వాలు" మార్చేరీతి
లోన అధికారపు కండూతి.  

23, మార్చి 2019, శనివారం

ఆ "నోటా!

ఓటరూ! అడిగేది
ఓటుకు ఆ నోటా?
ఓటు విలువ తెలుసుకో
ఈనోటా...ఆనోటా
అవసరమైతే నొక్కు
మీట, ఆ "నోటా".

3, మార్చి 2019, ఆదివారం

తంతే.

చీకటి ఉదయాన్నే చచ్చు
సూర్యుడు తంతే
మళ్ళీ సాయంత్రానికి వచ్చు
రోజూ జరిగే తంతే.


1, మార్చి 2019, శుక్రవారం

22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

విను వీధిని

చిత్రమైనది ఈ విధి
విను, వీధిని పడేస్తుందో!
ఎప్పుడు ఎవరిని
వినువీధిని తిప్పేస్తుందో!
19, ఫిబ్రవరి 2019, మంగళవారం

10, ఫిబ్రవరి 2019, ఆదివారం

ఓ పన్ జెయ్


Image result for god net
దేవుడి "నెట్"
కనెక్ట్ అవ్వాలా
ఓ పన్జెయ్
మది "సిస్టం"లో
భక్తి "విండోస్"ని
ఓపన్జెయ్.