అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులందరికీ శుభాకాంక్షలు.
ఆ సందర్భంగా నేను వ్రాసిన పాట.మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
లోకమ్మున కల్పతరువు మహిళా
ఇంతి రూపమ్మున ఇంటి పరువు మహిళా
బ్రహ్మయ్యకు మారురూపు మహిళా
వాని కన్నయ్యకు దార రూపు మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
పసివారికి పాలబువ్వ మహిళా
సరి మగనికి ఎద గూటిగువ్వ మహిళా
తనవారికి నెనరు మువ్వ మహిళా
మరి పగవారికి నిప్పురవ్వ మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
లాలిస్తే పూలతీగ మహిళా
తాను కోపిస్తే కందిరీగ మహిళా
ద్వేషిస్తే గ్రద్ద డేగ మహిళా
మెచ్చి ప్రేమిస్తే ముద్దు లేగ మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
పురుషునికందిన యోగం మహిళా
తల్లి అగుటకూ ఘనత్యాగం మహిళా
కాదనుకో ఇల భోగం మహిళా
ఆగం కాకూడని ఒక యాగం మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
1 కామెంట్:
ప్రపంచ పురుషుల దినోత్సవం నవంబరు 19 తేదీ న వస్తుంది. ముందస్తుగా ఒక
రచన.
ఇలలో దేవుడు లాంటి పురుషుడు
కుటుంబానికై జీవితం త్యాగం చేస్తాడు.
నిరంతరం తన వారికై తపన పడతాడు.
బస్సులో టిక్కెట్ కొని ప్రయాణం చేస్తాడు.
ఎంత కష్టపడినా సాటి మగవారి నుంచి కూడా సానుభూతికి నోచుకోడు.
ప్రత్యేక పథకాలు సౌకర్యాలు వర్తించవు .
సమాన హక్కుల కోసం ఆశిస్తాడు
అందుకోలేక ఆవేదన పడతాడు.
కుటుంబం కోసం సమాజం కోసం జీవిస్తాడు.
నిస్వార్థ జీవి పురుషుడు.
వందనం అభివందనం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి