30, నవంబర్ 2024, శనివారం

నిప్పు

 

నిజం "నిప్పు" లాంటిది
"వంట"బట్టే చోటో
"మంట" పుట్టే చోటో
తెలుసుకొని "బయట" పెట్టాలి.


29, నవంబర్ 2024, శుక్రవారం

28, నవంబర్ 2024, గురువారం

"ఓడ"నిస్తుంది

 

సరియైన జ్ఞానం
జీవనయానానికి
"ఓడ" ఔతుంది

పనికి మాలిన అతితెలివి
జీవన పోరాటంలో
"ఓడ"గొడుతుంది.


27, నవంబర్ 2024, బుధవారం

స్పష్టత

 

"స్పష్టత" కావాలంటే
కొన్నింటిని
"దగ్గరి" నుంచి చూడాలి
కొన్నింటిని
"దూరం" నుంచి చూడాలి
ఏది ఎలా చూడాలో
"స్పష్టత" నీకుండాలి.


25, నవంబర్ 2024, సోమవారం

కం"ట్రోల్"


 తాడిదన్నే వాడి
తలదన్నే వాడు
"ట్రోల్" చేసే వాడి
"తోల్" తీసే వాడు
ఉంటూనే ఉంటాడు.


13, నవంబర్ 2024, బుధవారం

"బూతు" కాలం

 

భూత కాలమంతా
"బూతు" కాలం కాదు
వర్తమాన మంతా
"వర్త్" మానం కాదు.


12, నవంబర్ 2024, మంగళవారం

నో రిప్లై

 "నో రిప్లై" అంటే?

వాడికి ఇంగ్లీష్ రాదు

అందుకే "నోరిప్పలే".


9, నవంబర్ 2024, శనివారం

కారం

 

వ్యంగ్యం, చమత్కారం
రుచి తెలియని వారికి
నోట పట్టని కారం
అరిగించుకోలేని వారికి
అజీర్ణపు ఛీత్కారం .