తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసిజరపాలీ గర్వముగా ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసిజరపాలీ గర్వముగా ఉగాదీ
పెందలకడ లేస్తేనే ఉగాదీ
వదలక తలస్నానం చేస్తేనే ఉగాదీ
దీపాన్నీ వెలిగిస్తే ఉగాదీ
పిదపదైవాన్నీ పూజిస్తే ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసి జరపాలీ గర్వముగా ఉగాదీ
వేపపూత పచ్చడుంటె ఉగాదీ
పిందెమామిళ్ళూ కలుపుకుంటె ఉగాదీ
ఆరు రుచులు సరికుదిరితె ఉగాదీ
దాన్ని అరచేతను వేసితింటె ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసిజరపాలీ గర్వముగా ఉగాదీ
పులిహోరను చేసుకుంటె ఉగాదీ
మరీ పరమాన్నం మరువకుంటె ఉగాదీ
పిండివంట వండుకుంటె ఉగాదీ
తెలుగు భోజనమే తినిత్రేంచితె ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసి జరపాలీ గర్వముగా ఉగాదీ
చైత్రాదుల నెరిగుండుట ఉగాదీ
ఋతువులారిటినీ సరితెలియుట ఉగాదీ
వత్సరముల పేర్లరయుట ఉగాదీ
కాలగతి తెలిసి నడచుకొనుట ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసిజరపాలీ గర్వముగాఉగాదీ
తెలుగుతీపి చవిజూచుట ఉగాదీ
తెలుగు వెలుగులను తలచుకొనుట ఉగాదీ
తెలుగుతల్లి బిడ్డనంటె ఉగాదీ
నేను తెలుగునెపుడు మరువనంటె ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసి జరపాలీ గర్వముగా ఉగాదీ
తెలుగుతల్లి బిడ్డనంటె ఉగాదీ
నేను తెలుగునెపుడు మరువనంటె ఉగాదీ
నేను తెలుగునెపుడు మరువనంటె ఉగాదీ
నేను తెలుగునెపుడు మరువనంటె ఉగాదీ