28, మే 2025, బుధవారం

ఆ"నందమూరు"

 గతములో ఒక పోటీకి  వ్రాసి ప్రశంసలు పొందినది. 

"నందమూరి" జయంతి సందర్భంగా


శీర్షిక: ఆ"నందమూరు"    

 

ఆంధ్ర దేశంలో అది ఒక ఊరు "నిమ్మకూరు"    

అక్కడ నందమూరి వంశంలో పుట్టాడొక వెలుగు "స్టారు"      

"తారక రామారావు" పెద్దలు పెట్టిన పేరు 

"పేరు" తెచ్చుకున్నాక అయ్యాడతడు "ఎన్ టి యారు"   


కష్ట జీవిగా ఎదిగి "బీఏ" పట్టా సాధించారు    

ఆపైన చేసిన ఉద్యోగం తనకిమడని "సబ్ రిజిస్ట్రారు"   

అది నచ్చక  నటుడవాలని మద్రాసు దారి పట్టారు 

మొదట "మనదేశం" చిత్రంలో మంచి నటన చూపారు    


శివుడూ, రాముడూ, కృష్ణుడూ అంటే ఆయనే గుర్తొస్తారు 

దుర్యోధన,కర్ణ, రావణ నటనకూ  పెట్టింది పేరు 

విక్రమార్క,కృష్ణ రాయ,రాజ కుమార పాత్రలలో జోరు 

పలురకాల నటనలలో ఆయనకు పోటీ ఇప్పటికీ లేరు 


నిండైన విగ్రహంతో అలా నిలుచుండే తీరు 

చిరునవ్వులు చిందిస్తూ చేయెత్తితే కలుగు హుషారు 

బ్రదర్ అంటూ పలకరిస్తే గౌరవం పొంగారు  

హావభావాలతో చేసే ఉపన్యాసాలు  వింటే మరి కదలలేరు     

  

నటసార్వభౌమునిగా "పద్మశ్రీ" పురస్కారం పొందారు  

తెలుగు ప్రజల సేవ కోసమై "తెలుగు దేశం" పార్టీ పెట్టారు 

అఖండ విజయంతో  తెలుగు వారి "ఆత్మ గౌరవం" పెంచారు 

ఆంధ్రులందరికీ "అన్న" గా అయి సుపరిపాలన అందించారు


నటునలో, రాజకీయాలలో ప్రపంచ ఖ్యాతిని పొందారు

తెలుగు జాతికంతటికీ "యుగపురుషుడు" గా మారారు

చెరిగిపోని కీర్తి తో సర్వోన్నత శిఖరం అధిరోహించారు   

ఆ "నందమూరిని" తలిస్తే చాలు మనసులో "ఆనందమూరు".





10, మే 2025, శనివారం

బెట్టింగు

 బెట్టింగు బెట్టింగు బెట్టింగు

పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు గుర్రాల రేసుల్లో బెట్టింగు పేకాట జూదాలా బెట్టింగు క్రిక్కెట్టు ఆటల్లో బెట్టింగు ఎన్నికల ఫలితాలా బెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు జూదాలు బాగా ఆశబెట్టింగు చేతులేమొ నీకు దురద పెట్టింగు ఉంటుంది ఆవల వల సెట్టింగు గెలుపుండదు అంత సున్న చుట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు వేశావా దానితో సిట్టింగు ఆశతో కాశావా బెట్టింగు ఉన్నసొమ్మంతా ఊడగొట్టింగు ఆస్తులన్నంటినీ కుదువా బెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు పందేలు చేస్తాయా కూడు బెట్టింగు కుదిరెందెవరికి గెలిచి కూడ బెట్టింగు ఆడితె నీ భవిత పాడుబెట్టింగు కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు కట్టిపెట్టాలి చెడ్డదారిపట్టింగు చెడుస్నేహాలకు ఇవ్వరా కట్టింగు చేయాలి తెలివి పదునుబెట్టింగు మంచి త్రోవపైనా దృష్టిబెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు ఆపరా బెట్టింగులకు పరుగు బెట్టింగు చేయరా సిట్టింగులను పడుకొబెట్టింగు నేర్వరా చెడు తలపులకు పొగబెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలని ఫిట్టింగు ఆపరా బెట్టింగులకు పరుగు బెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు

అంజనసూతీ

 ఆర్త జనుల రక్షకుడే   అంజనసూతీ   

ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ 

 

ఆర్త జనుల రక్షకుడే అంజనసూతీ   

ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ  

ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ  


శ్రీరాముని భక్తులలో అగ్రగణ్యుడు

శతయోజన వార్ధి దాటిన శక్తిమంతుడు

శ్రీరాముని భక్తులలో అగ్రగణ్యుడు

శతయోజన వార్ధి దాటిన శక్తిమంతుడు

అసురుల గూల్చినా శౌర్య వంతుడు    

భక్తుల బ్రోచుటలో కారుణ్య గుణవంతుడు

ధైర్యవంతుడు బుద్ధిమంతుడు హనుమంతుడూ  

ఆర్త జనుల రక్షకుడే అంజనసూతీ  

ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ 


భూత ప్రేతముల పీడలు  తొలగిపోవును  

సర్వరోగముల బాధలు సమసిపోవును

భూత ప్రేతముల పీడలు  తొలగిపోవును  

సర్వరోగముల బాధలు సమసిపోవును  

బుద్ధియు కలుగును ధైర్యము పెరుగును     

పాపం మాసిపోవు సర్వకార్య జయమగును   

మారుతికి మనసులో నమస్కరించగా  

ఆర్త జనుల  రక్షకుడే  అంజనసూతీ   

ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ   

 

ఆర్త జనుల  రక్షకుడే అంజనసూతీ  

ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ 

ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ

మహా దేవా! సదాశివా!

 మహా దేవా! సదాశివా   

నీకు మాకు తేడా లేదురా శంకరా   

అహ నీకన్న మేమె గొప్ప  హరోంహరా    

అహ నీకన్న మేమె గొప్ప  హరోంహరా !

      

మంటకన్ను ఒక్కటుంది నీకే శివా

మంటకన్ను ఒక్కటుంది నీకే శివా 

మాకు రెండుకళ్ళ మంటలేరా శంకరా

మేము దేన్ని చూసి ఓర్చలేము హరోంహరా!  


అహ నీకన్న మేమె గొప్పరా శంకరా  

కోరిక కాల్చి  బూడిద జేశావ్ నీవే శివా  

కోరిక కాల్చి  బూడిద జేశావ్ నీవే శివా   

మా కోరికే బూడిద చేయటంరా శంకరా  

మమ్ము నమ్మినోడ్ని కాల్చి వేస్తాం  హరోంహరా!

  

అహ నీకన్న మేమె గొప్పరా శంకరా  

మెడచుట్టు పాములున్నాయ్ నీకే శివా  

మెడచుట్టు పాములున్నాయ్ నీకే శివా 

మా తలపుట్ట నిండ పాములురా శంకరా   

అవి కాటు వేయగ చూస్తూ ఉంటాయ్ హరోంహరా! 

    

అహ నీకన్న మేమే గొప్పరా శంకరా 

గొంతులోన   ఇంతే విషము నీకే శివా

గొంతులోన   ఇంతే విషము నీకే శివా

మాకు అంతా విషమే నిండి ఉందిరా శంకరా  

మేము అక్కడ ఇక్కడ కక్కేస్తుంటాం హరోంహరా! 

    

అహ నీకన్న మేమె గొప్పరా శంకరా  

మంచీ ఎద్దు వాహనముంది నీకే శివా

మంచీ ఎద్దు వాహనముంది నీకే శివా  

మా బుద్ధే ఎద్దూ లాంటిదిగదరా శంకరా  

దాన్ని వదలక పట్టి తిరుగుతుంటాం  హరోంహరా!   

      

అహ నీకన్న మేమె గొప్పరా శంకరా   

ఏనుగుతోలు తీసికట్టావు నీవే శివా 

ఏనుగుతోలు తీసికట్టావు నీవే శివా   

మా పోటీ గాడికి తోలు తీస్తాంరా శంకరా 

మమ్మెదిరిస్తే వాడి తాటతీస్తాం హరోంహరా 

      

అహ నీకన్న మేమె గొప్పరా శంకరా  

అన్నీ తెలిసిన తెలివి ఉంది నీకే శివా

అన్నీ తెలిసిన తెలివి ఉంది నీకే శివా 

మాకు అంతకన్నా ఎక్కువ తెలివిరా శంకరా    

ఎంతో అతితెలివి మాకే ఉంది హరోంహరా!

        

అహ నీకన్న మేమె గొప్పరా శంకరా  

ఎవరు ఎక్కువో తెలుసుకుందాం రారా శివా 

ఎవరు ఎక్కువో తెలుసుకుందాం రారా శివా 

మా గుండెలె కొలువూ చక్కగ నీవే రా శంకరా    

నిన్నూ కొలిచీ కొలిచీ చూసుకుంటాం హరోంహరా

నిన్నూ కొలిచీ కొలిచీ చూసుకుంటాం హరోంహరా! 



        

రామయ్యా ఓ రామయ్యా

  

రామయ్యా  రామయ్యా 

మముబ్రోవగ వేగమె రావయ్యా          

 రామయ్యా  రామయ్యా 

మముబ్రోవగ వేగమె రావయ్యా    

నిన్నే వీడక రామయ్యా 

మది వేడితిమయ్యా రామయ్యా  

రామయ్యా  రామయ్యా 

మముబ్రోవగ వేగమె రావయ్యా  

 

దశరథ సుతుడవు నీవటా  

దశకంఠుని గూలిచి నావటా

దశరథ సుతుడవు నీవటా  

దశకంఠుని గూలిచి నావటా    

దశదిశలను నిండినావటా

రామయ్యా  రామయ్యా 

దశదిశలను నిండినావటా

రామయ్యా  రామయ్యా         

మాజీవితాన మంచి  దశలందించగ రావయ్యా!        

మాజీవితాన మంచి  దశలందించగ రావయ్యా!

రామయ్యా  రామయ్యా 

మముబ్రోవగ వేగమె రావయ్యా          

 

వరగుణముల రాజువు నీవటా   

వరజాతయె నీకే సతియటా

వరగుణముల రాజువు నీవటా   

వరజాతయె నీకే సతియటా      

వరదుడను పేరు నీదటా  

రామయ్యా  రామయ్యా 

వరదుడను పేరు నీదటా  

రామయ్యా  రామయ్యా     

నీదయ మాపై వరలెడునటు వరమీవయ్యా    

నీదయ మాపై వరలెడునటు వరమీవయ్యా  

 

రామయ్యా  రామయ్యా 

మముబ్రోవగ వేగమె రావయ్యా   

నిన్నే వీడక రామయ్యా

మది వేడితిమయ్యా రామయ్యా  

రామయ్యా  రామయ్యా 

మముబ్రోవగ వేగమె రావయ్యా  

మముబ్రోవగ వేగమె రావయ్యా   

మముబ్రోవగ వేగమె రావయ్యా