22, మార్చి 2025, శనివారం

కవిత్వమంటే

 కవిత్వమంటే కవిత్వమంటే 


కవిత్వమంటే కవిత్వమంటే

కవిత్వమంటే ఒక యోగం 

కవిత్వమంటే ఒక యాగం 

కవిత్వమంటే ఒక యానం

కవిత్వమంటే ఒక ధ్యానం   

కవిత్వమంటే ఒక స్నేహం

కవిత్వమంటే ఒక మోహం  


కవిత్వమంటే కవిత్వమంటే

కవిత్వమంటే ఒక శక్తి 

కవిత్వమంటే ఒక యుక్తి 

కవిత్వమంటే ఒక కత్తి  

కవిత్వమంటే ఒక రక్తి

కవిత్వమంటే ఒక భక్తి

కవిత్వమంటే ఒక భుక్తి


కవిత్వమంటే కవిత్వమంటే

కవిత్వమంటే ఒక రవ్వ

కవిత్వమంటే ఒక చివ్వ

కవిత్వమంటే ఒక గువ్వ 

కవిత్వమంటే ఒక మువ్వ   

కవిత్వమంటే ఒక నవ్వు

కవిత్వమంటే ఒక పువ్వు


కవిత్వమంటే కవిత్వమంటే

కవిత్వమంటే ఒక విందు 

కవిత్వమంటే ఒక మందు

కవిత్వమంటే ఒక సూది

కవిత్వమంటే ఒక దూది

కవిత్వమంటే ఒక ధుని 

కవిత్వమంటే ఒక గని  


కవిత్వమంటే కవిత్వమంటే

కవిత్వమంటే ఒక దివి

కవిత్వమంటే ఒక చవి 

కవిత్వమంటే ఒక రవి

కవిత్వమంటే ఒక పవి

కవిత్వమంటే ఒక తావి

కవిత్వమంటే ఒక భావి 


కవిత్వమంటే కవిత్వమంటే

కవిత్వమంటే ఒక జపం

కవిత్వమంటే ఒక తపం

కవిత్వమంటే ఒక ఫలం 

కవిత్వమంటే ఒక బలం

కవిత్వమంటే ఒక మానం

కవిత్వమంటే ఒక జ్ఞానం 


కవిత్వమంటే ఒక జ్ఞానం 

కవిత్వమంటే ఒక ధ్యానం 

కవిత్వమంటే ఒక యోగం

కవిత్వమంటే ఒక యాగం  

21, మార్చి 2025, శుక్రవారం

కవిత్వమంటే

 అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా....


కవిత్వమంటే ఒక శక్తి
కవిత్వమంటే ఒక యుక్తి

కవిత్వమంటే ఒక కత్తి
కవిత్వమంటే ఒక రక్తి

కవిత్వమంటే ఒక భక్తి
కవిత్వమంటే ఒక భుక్తి

కవిత్వమంటే ఒక నవ్వు
కవిత్వమంటే ఒక పువ్వు

కవిత్వమంటే ఒక రవ్వ
కవిత్వమంటే ఒక చివ్వ

కవిత్వమంటే ఒక స్నేహం
కవిత్వమంటే ఒక మోహం

కవిత్వమంటే ఒక విందు
కవిత్వమంటే ఒక మందు

కవిత్వమంటే ఒక మంట
కవిత్వమంటే ఒక గంట

కవిత్వమంటే ఒక సూది
కవిత్వమంటే ఒక దూది

కవిత్వమంటే ఒక దివి
కవిత్వమంటే ఒక చవి

కవిత్వమంటే ఒక ధుని
కవిత్వమంటే ఒక వని

కవిత్వమంటే ఒక రవి
కవిత్వమంటే ఒక పవి

కవిత్వమంటే ఒక జపం
కవిత్వమంటే ఒక తపం

కవిత్వమంటే ఒక ఫలం
కవిత్వమంటే ఒక బలం

కవిత్వమంటే ఒక మానం
కవిత్వమంటే ఒక జ్ఞానం

కవిత్వమంటే ఒక సజ్జ
కవిత్వమంటే ఒక ఒజ్జ


14, మార్చి 2025, శుక్రవారం

హోలీ హోలీ హోలీ

 


హోలీ హోలీ హోలీ 

పలు రంగులతో రంగేళీ


హోలీ హోలీ హోలీ 

పలు రంగులతో రంగేళీ


ఫాల్గున పౌర్ణమి హోలీ  

హోలిక రాక్షసి దహనం హోలీ 

కాముని పున్నమి హోలీ   

కృష్ణ రాసలీలలే హోలీ 

ఫాల్గున పౌర్ణమి హోలీ   

హోలిక రాక్షసి దహనం హోలీ 

కాముని పున్నమి హోలీ   

కృష్ణ రాసలీలలే హోలీ 

హోలీ హోలీ హోలీ 


 

ఉభయ సంధ్యలలో నింగీ

సూర్యుని రంగులాటలే  హోలీ

నలుపు తెలుపు మేఘాలూ

ఆకాశపుటాటలె హోలీ

ఉభయ సంధ్యలలో నింగీ

సూర్యుని రంగులాటలే  హోలీ

నలుపు తెలుపు మేఘాలూ

ఆకాశపుటాటలె హోలీ

హోలీ హోలీ హోలీ 

పలు రంగులతో రంగేళీ 


చిరుజల్లుల వేళల పట్టే

హరివిల్లు పూతలే హోలీ  

భూమిపైన వెదజల్లే

పలుపూవుల జల్లులె హోలీ 

చిరుజల్లుల వేళల పట్టే

హరివిల్లు పూతలే హోలీ  

భూమిపైన వెదజల్లే

పలుపూవుల జల్లులె హోలీ    

హోలీ హోలీ హోలీ 

పలు రంగులతో రంగేళీ 


తెల్లని మదితెర పైన

మనిషి రంగులకలలే హోలీ 

కృషితో అవినిజమైతే

తన జీవితమంతా హోలీ   

హోలీ హోలీ హోలీ 

పలు రంగులతో రంగేళీ 

తెల్లని మదితెర పైన

మనిషి రంగులకలలే హోలీ 

కృషితో అవినిజమైతే

తన జీవితమంతా హోలీ  

హోలీ హోలీ హోలీ 

పలు రంగులతో రంగేళీ 

హోలీ హోలీ హోలీ 

పలు రంగులతో రంగేళీ   

  

12, మార్చి 2025, బుధవారం

పిల్లలు పిల్లలు పిల్లలు

 పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు

ఇంటికి బంగరు కొండలూ 

తలిదండ్రుల మెత్తని గుండెలూ  

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు         

  

కళ్ళు చూస్తే వెలిగేటి దివ్వెలు

బుగ్గలేమో లే గులాబీ పువ్వులు

నోటినిండా అహ బోసీ నవ్వులూ   

ఎగరలేని పసి తారాజువ్వలూ  

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు    


నడకొస్తే కుందేటీ పిల్లలు

మాటొస్తే పూతేనె జల్లులు  

ఏడిస్తే ఆకాశం చిల్లులు 

ఆడిస్తే ఎవరెస్టూ హిల్లులు 

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు 


వదిలేస్తే తోకలేని కోతులూ  

అదిలిస్తే చాలు  బుంగ మూతులూ    

మూడొస్తే గోడమీద గీతలూ      

కనిపిస్తయ్ మోడ్రనార్టూ రీతులూ       

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు   


ఇవ్వాలీ ఎన్నెన్నో ముద్దులూ

నింపాలీ తలనిండా బుద్ధులూ 

తినిపించాలీ చిరుకోపపు గుద్దులూ 

నేర్పించాలీ మరి సుద్దులూ హద్దులూ  

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు   


చూపించాలి సంస్కారపు దారులూ 

అందించాలి విజ్ఞానపు కారులూ    

కాకుండా ఉండాలి చోరులూ   

కావాలీ భావికి సరి పౌరులూ  

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు 

ఇంటికి బంగరు కొండలూ 

తలిదండ్రుల మెత్తని గుండెలూ  

పిల్లలు పిల్లలు పిల్లలు

వసివాడని తెల్లని మల్లెలు  

పిల్లలు పిల్లలు పిల్లలు 

వసివాడని తెల్లని మల్లెలు           

8, మార్చి 2025, శనివారం

మహిలోనా దేవతరా మహిళా

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులందరికీ శుభాకాంక్షలు.

ఆ సందర్భంగా నేను వ్రాసిన పాట.

మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా

మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా

లోకమ్మున కల్పతరువు మహిళా
ఇంతి రూపమ్మున ఇంటి పరువు మహిళా
బ్రహ్మయ్యకు మారురూపు మహిళా
వాని కన్నయ్యకు దార రూపు మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా

పసివారికి పాలబువ్వ మహిళా
సరి మగనికి ఎద గూటిగువ్వ మహిళా
తనవారికి నెనరు మువ్వ మహిళా
మరి పగవారికి నిప్పురవ్వ మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా

లాలిస్తే పూలతీగ మహిళా
తాను కోపిస్తే కందిరీగ మహిళా
ద్వేషిస్తే గ్రద్ద డేగ మహిళా
మెచ్చి ప్రేమిస్తే ముద్దు లేగ మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా

పురుషునికందిన యోగం మహిళా
తల్లి అగుటకూ ఘనత్యాగం మహిళా
కాదనుకో ఇల భోగం మహిళా
ఆగం కాకూడని ఒక యాగం మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా