31, డిసెంబర్ 2024, మంగళవారం

కళ

ముఖంలో

"అందం" నిండుగుంది

బొట్టులేకేమో

అందులో

కళ "నిండుకుంది"

 

28, డిసెంబర్ 2024, శనివారం

తడి

 

షుగర్, బీపీలే కాదు
పరీక్షించుకోవాలి
అప్పుడప్పుడూ
గుండె "తడి" కూడా.


27, డిసెంబర్ 2024, శుక్రవారం

తోపులాట

 బలహీనుల 

ప్రాణం మీదికే 

కొన్ని "తోపులాట" లు

కొందరు "తోపు"లాటలు

21, డిసెంబర్ 2024, శనివారం

గట్టీయం


పాఠశాలలో పరీక్షలకు
సరిపోతుంది "బట్టీయం"
జీవితంలో పరీక్షలకు
కావాలి గుండె "గట్టీయం"


9, డిసెంబర్ 2024, సోమవారం

అక్షర "బీజాలు"

 "నీ" నోటినుండి వచ్చే 

మాటల అక్షర "బీజాలు"  

ప్రకృతి పొలంలో "వెదజల్లబడి"  

తగిన "ప్రతిఫలాన్ని" 

"నీకే" అందిస్తాయి 

పంట"కాలాన్ని" బట్టి

6, డిసెంబర్ 2024, శుక్రవారం

పరమ గురు చక్ర

 

విద్యాబుద్ధులు
నేర్పటం కూడా
ప్రాణాంతక మౌతున్నది
సాహస గురువులకు
"పరమ గురు చక్ర" ఇవ్వాలి.