27, అక్టోబర్ 2024, ఆదివారం

ప్రేమ

 

వాడి మీద వీడికి
"ఈగ"ను వాలనివ్వని ప్రేమ

ఒంటికి "అదేదో" అంటిన కారణం
పట్టించుకోడు రామరామ.


26, అక్టోబర్ 2024, శనివారం

"మందే" లేకుంటే

 

"మందే" లేకుంటే
త్రాగటానికి
అంత "మందే" లేకుంటే
ఇక ఏమందును
రాబడిలేక ప్రపంచం
"మందు" తాగాల్సిందే.


18, అక్టోబర్ 2024, శుక్రవారం

క్రొవ్వు

 

తినేటప్పుడు
నోటి అదుపు లేకుంటే
క్రొవ్వెక్కుతుంది
అనేటప్పుడు
నోటి అదుపు లేకుంటే
క్రొవ్వు దిగుతుంది.

6, అక్టోబర్ 2024, ఆదివారం