27, మే 2024, సోమవారం

క( కు)క్కకు

 

కనబడినదల్లా
కడుపులో కుక్కకు
బరువైపోతావు

కడుపులో ఉన్నదల్లా
బయటకు "కక్కకు"
"తేలికై"పోతావు.

26, మే 2024, ఆదివారం

"బ్రేవ్" పార్టీ


 "రేవ్" పార్టీ అంటే
లోపల మొత్తం
విప్పుకుని ఆడటం
బయటకు ముఖం
కప్పుకుని రావటం



18, మే 2024, శనివారం

నా"గరిక"

 


బహుశా
ఆ నా"గరిక"
దుస్తులను
"డిజైన్" చేసింది
"సివిల్ ఇంజనీర్స్"

అందుకే
తయారీలో నైపుణ్యం
చూ"పిచ్చి" ఉంచారు
విండోస్ అండ్
వెంటిలేటర్స్.

13, మే 2024, సోమవారం

"voteమి"

 

ఓటరుకు నాయకులను
"ఎన్నుకొనే" సమయం
నాయకులకు ఓటరును
ఎన్ని, "కొనే" సమయం

ప్రతి వాడూ
అంటాడు "vote me"
చెడ్డవాడికి
అందించు "ఓటమి"

2, మే 2024, గురువారం

way to "వేటు"

 

సరియైన వారికి
వేసే "ఓటు"
మంచి భవిత
బతుకుకు "ఓ2"
లేకుంటే అవుతుంది
way to "వేటు"