
చరవాణిని చేరెను నెట్టు
చేరి లోపల నిలచెను గుట్టు
అరచేతిలొ అమరేటట్టు
అరచేపనికి శెలవిచ్చేట్టు
దూరం వారిని దగ్గర చేసేట్టు
దగ్గర వారిని దూరం జరిపేట్టు
పిల్లలకు ఎన్నో ఆటలు నేర్పేట్టు
వారి భవిష్యత్తుతో ఆటలు ఆడేట్టు
అరె మహాద్భుతమని అనేట్టు
మరి భూతము లాగా పట్టేట్టు
అది భూతమా,అద్భుతమా, కనిపెట్టు
కనిపెట్టడం కష్టమే అదో కనికట్టు.